Teachers9.com updates

latest info

More Posts >>

Teachers9

More Posts >>

Teachers Useful Info

More Posts >>

ట్రైన్ టికెట్ బుకింగ్ కొత్త రూల్స్


Read also:

 మీరు ట్రైన్ జర్నీ ఎక్కువగా చేస్తుంటారా? అయితే మీకు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. ట్రైన్ టికెట్ బుకింగ్‌కు సంబంధించి కొత్త రూల్స్ అమలులోకి వచ్చింది. ఇకపై ప్రయాణికులు టికెట్ బుకింగ్ సమయంలో వారి నెంబర్‌ను కచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి.

ప్రయాణికులు చాలా మంది బుకింగ్ ఏజెంట్లు లేదంటే ఇతరుల ఐఆర్‌సీటీసీ అకౌంట్ ద్వారా ట్రైన్ టికెట్లు బుక్ చేసుకుంటున్నారని ఇండియన్ రైల్వేస్ తెలిపింది. దీంతో ప్యాసింజర్ మొబైల్ నెంబర్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ PRS లో రిజిస్టర్ అవ్వడం లేదని పేర్కొంది. దీని వల్ల ప్రయాణికులు ఎస్ఎంఎస్ నోటిఫికేషన్స్ పొందలేకపోతున్నారని తెలిపింది.

ట్రైన్ క్యాన్సిల్ అవ్వడం, లేదంటే ఇతర వివరాలు ప్రయాణికులకు చేరడం లేదని ఇండియన్ రైల్వేస్ తెలిపింది. అందుకే ట్రైన్ టికెట్ బుకింగ్ సమయంలో కచ్చితంగా ఫోన్ నెంబర్‌ను రిజిస్టర్ చేసుకోవాలని తెలిపింది. దీని వల్ల ప్రయాణికులకు వారి ట్రైన్ అప్‌డేట్స్ లభిస్తుంటాయి.


ఇకపోతే ఇప్పుడు రైల్వే ప్రయాణికులు వారి 91-9881193322 నెంబర్ ద్వారా వారి ట్రైన్ వివరాలు పొందొచ్చు. ఈ నెంబర్‌ను వాట్సాప్‌లో సేవ్ చేసుకోవాలి. తర్వాత మీ పీఎన్ఆర్ స్టేటస్‌ను వాట్సాప్‌లో షేర్ చేయాలి. ఇప్పుడు ట్రైన్ అప్‌డేట్స్ మీకు వస్తూనే ఉంటాయి.

Post a Comment

0 Comments