Teachers9.com updates

latest info

More Posts >>

Teachers9

More Posts >>

Teachers Useful Info

More Posts >>

PF అకౌంట్‌తో పాన్ కార్డు కచ్చితంగా లింక్ చేసుకోవాలా? లేదంటే ఏమౌతుంది?


Read also:

PF అకౌంట్‌తో పాన్ కార్డు కచ్చితంగా లింక్ చేసుకోవాలా? లేదంటే ఏమౌతుంది?

*®PF అకౌంట్‌తో పాన్ కార్డు కచ్చితంగా లింక్ చేసుకోవాలా? లేదంటే ఏమౌతుంది?*



*®మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అలాగే పాన్ కార్డు కూడా కలిగి ఉన్నారా? అయితే ఈ రెండింటినీ లింక్ చేసుకున్నారా? పీఎఫ్ అకౌంట్‌తో పాన్ కార్డును కచ్చితంగా లింక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే లింక్ చేసుకుంటే ఒక బెనిఫిట్ పొందొచ్చు.*

*®ఈపీఎఫ్ అకౌంట్‌తో ఆధార్ అనుసంధానం తప్పనిసరి. పీఎఫ్ విత్‌డ్రాకు సంబంధించి బ్యాంక్ అకౌంట్‌తో పాన్ నెంబర్ లింక్ ఇప్పటికీ కూడా తప్పనిసరి కాదు. అయితే ఆన్‌లైన్‌లో పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలని భావిస్తే మాత్రం కేవైసీ వివరాలు కచ్చితంగా అప్‌డేట్ చేసుకొని ఉండాలి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) తన సబ్‌స్క్రైబర్లకు పాన్ కార్డును పీఎఫ్ అకౌంట్‌తో లింక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.*

*®తప్పనిసరి కానప్పటికీ పాన్ నెంబర్‌ను ఈపీఎఫ్ అకౌంట్‌తో లింక్ చేసుకోవాలి. రెండింటినీ లింక్ చేసుకోకపోతే ఫైనాల్ పీఎఫ్ విత్‌డ్రా సమయంలో 34.6 శాతం టీడీఎస్ కట్ అవుతుంది. అదే మీరు పీఎఫ్ ఖాతాతో పాన్ కార్డు అనుసంధానం చేసుకుంటే టీడీఎస్ 10 శాతంగా కట్ అవుతుంది. అందువల్ల రెండింటినీ లింక్ చేసుకుంటే భవిష్యత్ క్లెయిమ్స్‌ సమయంలో ప్రయోజనం పొందొచ్చు.*

 *®పాన్ కార్డు, పీఎఫ్ అకౌంట్‌ను సులభంగానే అనుసంధానం చేసుకోవచ్చు. దీని కోసం ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌కు వెళ్లి అక్కడ యూఏఎన్, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అవ్వాలి. తర్వాత మేనేజ్ సెక్షన్‌లోకి వెళ్లి కేవైసీ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇక్కడ మీకు పలు డాక్యుమెంట్లు కనిపిస్తాయి. పాన్ ఆప్షన్ ఎంచుకోండి. పాన్ కార్డు వివరాలు నమోదు చేయండి.*


*®ఇలా పాన్ కార్డు వివరాలను కరెక్ట్‌గా ఎంటర్ చేసిన తర్వాత సేవ్ బటన్‌పై క్లిక్ చేయాలి. మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు వెళ్తుంది. కేవైసీ డాక్యుమెంట్ అప్రూవల్ తర్వాత వెరిఫికేషన్ పూర్తవుతుంది. మీ పాన్ కార్డు నెంబర్ ఈపీఎఫ్ అకౌంట్‌తో అనుసంధానం అవుతుంది. తర్వాత పాన్ కార్డు వివరాల దగ్గర వెరిఫైడ్ అని రాసి ఉంటుంది.*

Post a Comment

0 Comments