Teachers9.com updates

latest info

More Posts >>

Teachers9

More Posts >>

Teachers Useful Info

More Posts >>

How can you change your bank ATM Pin number


Read also:

How can you change your bank ATM Pin number.. 

ఏటీఎం పిన్ మర్చిపోతే... సులువుగా మార్చుకోండిలా..


How can you change your bank ATM Pin number

ప్రస్తుత సమాజంలో చేతిలో స్మార్ట్ ఫోన్ లేనివాళ్లు వ్యాలెట్ లో ఏటీఎం కార్డు లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ప్రతిఒక్కరికి ఇవి రెండు తప్పనిసరి.
అయితే ఒక్కోసారి మనం డెబిట్ కార్డు పిన్ మర్చిపోయి 3 సార్లు రాంగ్ పిన్ ఎంటర్ చేస్తుంటాం. ఆలా రాంగ్ పిన్ ఎంటర్ చేసినప్పుడు డెబిట్ కార్డు వెంటనే బ్లాక్ అయిపోతుంది. మల్లి డెబిట్ కార్డు తిరిగి పని చేయడానికి 24 గంటల సమయం పడుతుంది.అయితే ఇప్పుడున్న టెక్నాలజీకి కొత్త పిన్ యాక్టివేట్ చేసుకోవడానికి పెద్ద సమయం పట్టదు. వెంటనే యాక్టివేట్ చేసుకోవచ్చు .ఎలా అనుకుంటున్నారా?

ఏటీఎం కార్డు పిన్ మర్చిపోతే తిరిగి కొత్త పిన్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసు కుందాం*


ఏటీఎం కార్డు పిన్ తెలుసుకోవడానికి డెబిట్ కార్డు బ్యాంకు అకౌంట్ నెంబర్ అలాగే బ్యాంకు అకౌంట్ కి లింక్ అయిన ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి.
ఏటీఎం మెషిన్ లో ఏటీఎం కార్డు పెట్టిన వెంటనే మీకు BANKING అనే ఆప్షన్ కనిపిస్తుంది. వెంటనే BANKING ఆప్షన్ ను సెలెక్ట్ చేయండి.
బ్యాంకింగ్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే PIN CHANGE లేదా ATM PIN RESET అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది సెలెక్ట్ చేయండి.
పిన్ చేంజ్‌ లేదా ఎటిఎం పిన్ రీసెట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక మీకు ENTER BANK ACCOUNT NUMBER అని మిమ్మల్ని అడుగుతుంది. వెంటనే బ్యాంకు అకౌంట్ నెంబర్ ను ఎంటర్ చేయండి.
 బ్యాంకు అకౌంట్ నెంబర్ ను ఎంటర్ చేశాక మీ ఫోన్ నంబర్‌ ను కూడా అడుగుతుంది. వెంటనే బ్యాంకు అకౌంట్ కు లింక్ చేసిన ఫోన్ నెంబర్ ను ఎంటర్ చేయండి.
ఫోన్ నెంబర్ ఎంటర్ చేసాక మీ ఫోన్ నెంబర్ కు OTP రావడం జరుగుతుంది. ఆ ఓటీపి ను ఏటీఎంలో ఎంటర్ చేశాక `పిన్ చేంజ్` అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ లోకి వెళ్ళి ఏటీఎం కార్డు పిన్ ను చేంజ్ చేసుకోవచ్చు. ఆలా చేసుకోవడం ద్వారా పాత ఎటిఎం పిన్ డిలీట్ అయ్యిపోయి కొత్త ఏటీటిఎం పిన్ యాక్టివేట్ అవుతుంది. చూశారుగా ఎప్పుడైనా మీ ఏటీఎం పిన్ మర్చిపోతే ఇలా ట్రై చేయండి.

Post a Comment

0 Comments