Teachers9.com updates

latest info

More Posts >>

Teachers9

More Posts >>

Teachers Useful Info

More Posts >>

Food that boosts immunity A diet rich in vitamin C helps boost immunity


Read also:
Food that boosts immunity A diet rich in vitamin C helps boost immunity. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం. విటమిన్ సి ఉన్న ఆహారం రోగనిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది.

ఇమ్యూనిటీ శాతం పెరగాలంటే
కింద సూచించిన పదార్థాలను కొనుగోలు చేయండి/వాడండి. వీటివల్ల మీ రోగ నిరోధక శక్తి       (ఇమ్యూనిటీ)   పెరుగుతుంది
1) ఉసిరి
 దీన్ని ఆమ్లా అని కూడా పిలుస్తారు. ఇందులో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. తెల్ల రక్తకణాల సంఖ్యను పెంచి.. రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. అలాగే ఫ్లూ లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా సాయపడుతుంది.
2) మిరియాలు
ప్రస్తుతం మిరియాలను చాలా మంది ఆరోగ్యం కోసం కాకుండా గార్నిష్ కోసం వాడుతున్నారు. ఇందులో ఉండే పిపెరిన్ అనే పదార్థంలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఉన్న హానికర టాక్సిన్లను శుభ్రపరుస్తుంది.
3) తులసి
ఇందులోని యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పి, దగ్గు తగ్గుతాయి. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. శ్వాసకోశ వ్యాధులను సైతం తగ్గించేందుకు తులసి సాయపడుతుంది.
4) పసుపు
ఇందులోని కర్కుమిన్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పూతో పాటు గుండె వ్యాధులను నయం చేసేందుకు పసుపు ఉపయోగపడుతుంది. అలాగే  జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. గొంతు నొప్పిని తగ్గిస్తుంది.
5) నేరేడు
నేరేడు పండు వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు అజీర్తి కాకుండా చేస్తుంది. రక్తపోటు (బీపీ)ని అదుపులో ఉంచడంతో పాటు రక్తంలోని చక్కెర నిల్వలను నియంత్రిస్తుంది. నేరేడు వల్ల జ్వరం, జలుబు, దగ్గు తగ్గుతుంది.
6) దాల్చిన చెక్క
ఇందులో ఉండే శక్తివంతమైన యాంటీ డయాబెటిక్ వల్ల రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గించేందుకు తోడ్పడుతుంది. అంతేకాకుండా ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ వల్ల ఇన్ఫెక్షన్లు, వ్యాధులు తగ్గుతాయి.
7) వేప
 వేప వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ఇందులోని లక్షణాలు మీకు ఇన్ఫెక్షన్లు సోకకుండా కాపాడుతాయి.
8) పుల్లటి పండ్లు
పుల్లటి పండ్లలో ఉన్న విటమిన్ C వల్ల తెల్ల రక్తకణాల ఉత్పత్తి పెరుగుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దాదాపు అన్ని రకాల పుల్లటి పండ్లలో విటమిన్ C ఉంటుంది. నారింజ, నిమ్మ.. లాంటి ఎన్నో రకాలు పుల్లటి పండ్లకు ఉదాహరణ.

This is the Food that boosts immunity A diet rich in vitamin C helps boost immunity

Post a Comment

0 Comments