Teachers9.com updates

latest info

More Posts >>

Teachers9

More Posts >>

Teachers Useful Info

More Posts >>

The Dilemma in AP Schools Holidays


Read also:
The dilemma in AP Schools Holidays.
18 రాష్ట్రాల్లో విద్యా సంస్థలు బంద్  -  రాష్ట్రంలో మూసివేతకు సీఎం నిరాసక్తి  - పెరుగుతున్న కరోనా అనుమానితులు -  రిస్క్ తీసుకోవడం అవసరమా  -  సెలవులిస్తేనే మేలంటున్న అధికారులు


The Dilemma in AP Schools Holidays


కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించేశాయి . రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనిపై డైలమాలో ఉంది . ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది . ఈ రెండు వారాల వ్యవధిలోనే 120 కేసులు పాజిటివ్ గా తేలాయి . పొరుగున ఉన్న తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యాసం స్థలు , సినిమాహాళ్లు , షాపింగ్ మాలు మూసేయాలని ఆదేశాలిచ్చాయి . బహిరంగ ప్రదేశాల్లో సమావేశాలను రద్దు చేసుకోవాలని ప్రజలకు ఆదేశాలు జారీచేశాయి . అయితే ఏపీలో ఇప్పటి వరకూ ఒక్క పాజిటివ్ కేసు మాత్రమే నమోదైంది . కానీ , ప్రతి జిల్లాలోనూ రోజుకి ఇద్దరు , ముగ్గురు ఆస్పత్రుల్లో చేరుతు న్నారు . మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలో మినీ హెల్త్ ఎమర్జెన్సీని అమలు చేస్తున్న ఆరోగ్య శాఖ . సోమవారం ప్రైవేటు ఆస్పత్రులతో కూడా చర్చలు జరిపింది . ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి వెయ్యి పడకలు సిద్ధం చేసుకోవాలని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాన్ని కోరారు . ఆదివారం సీఎం సమక్షంలో జరిగిన సమావేశంలో కూడా విద్యాసంస్థలు , సినిమా హాళ్ల మూసివేతపై చర్చించారు . సీఎంవోతో పాటు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు కూడా సెలవులు ప్రకటిస్తేనే మంచి దని సీఎంకు సూచించారు . దీనిపై సీఎం స్పందిస్తూ . . . ఎన్ని రోజులని సెలవు లిస్తాం . . అవసరం లేదు . . ? వైరస్ ప్రభావం అధికమైన ప్పుడు చూద్దాంలే . . అని దాటవేశారు . దీంతో అధికా రులు కూడా మిన్నకుండిపో యారు .

సెలవులపై ఒకేమాట

 కరోనా ప్రభావం , ప్రస్తుత పరిస్థితులపై సీఎంవో అది కారి పి . వి . రమేశ్ తొమ్మిది శాఖలతో విజయవాడలో సమావేశంలో నిర్వహించారు . ఈ సందర్భంగా జవహర్ రెడ్డి కరోనాపై అధికారులకు పవర్ పాయింట్ ప్రజంటే షన్ ఇచ్చారు . అనంతరం పాఠశాలు , కళాశాలలు , వర్సిటీలకు సెలవులు అంశం చర్చకు వచ్చింది . ఈ సమయంలో అన్ని శాఖ అధికారులు సెలవులు ప్రటిస్తేనే పాఠశాల విద్యాధికారులు కూడా రిస్క్ తీసుకోవడం ఎందుకన్న ఉద్దేశాన్ని వ్యక్తం చేశారు . ప్రస్తుతం విద్యార్థు లంతా ఫైనల్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు . సిలబస్ కూడా ఎప్పుడో హర్తయిపో యింది కాబట్టి ఇప్పుడు సెల వులు ప్రకటించినా నష్ట మేమీ లేదన్న అభిప్రా యాన్ని అధికారులు వ్యక్తం చేశారు . కానీ సీఎంతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో అధికారుల్లో క్లారిటీ లేకుండా పోయింది .

13 అనుమానిత కేసులు . . . 

రాష్ట్రంలో ప్రస్తుతం 13 అనుమానిత కేసులున్నాయి . మీదరిని ఆయా జిల్లాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యసేవ లందిస్తున్నారు . మంగళవా రానికి వీరి నివేదికలు వస్తా యని అధికారులు చెబుతు న్నారు . ఇప్పటి వరకూ నెల్లూరు మినహా ఎక్కడా పాజిటివ్ కేసులు నమోదుకాలేదు . 76 శాంపిలో 75 నెగిటివ్ వచ్చాయి . This is all about The Dilemma in AP Schools Holidays.

Post a Comment

0 Comments