PM Modi live speech on Corona virus (Covid-19) భారత్‌లో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ కేసుల సంఖ్య 492కు చేరుకుంది. కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్నారు. లాక్‌డౌన్‌పై కీలక విషయాలను మోదీ ప్రకటించే అవకాశం ఉంది. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధం చేస్తున్నాయి. అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. ప్రజలు నివాసాల నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. లాక్‌డౌన్ నియమ, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
PM Modi live speech on Corona virus (Covid-19)
0 Comments