AP CM press meet highlights on Corona virus Covid-19.
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్‌డౌన్ కారణంగా తెలంగాణ నుంచి వస్తున్న ఆంధ్రావాళ్లను కూడా రాష్ట్రంలోకి అనుమతించలేకపోవడం బాధకలిగించిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎక్కడ ఉన్నవాళ్లు అక్కడే ఉండకపోతే కరోనాను నియంత్రించలేమని స్పష్టం చేశారు. ఏ ప్రాంతంలో ఉన్న వారు అక్కడే ఉండాలని విజ్ఞప్తి చేశారు. గురువారం ప్రజలనుద్దేశించి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ కరోనాలాంటి వైరస్ వందేళ్లకు ఓ సారి వస్తుందేమో. జీవితంలో ఒక జనరేషన్ ఒకసారి చూస్తారేమో. ఇలాంటి వైరస్‌లను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. అలా ఎదుర్కోలేకపోతే భావితరాలపై ఆ ప్రభావం పడుతుంది. కేవలం క్రమశిక్షణతోనే మనం కరోనాను గెలవగలం. నిర్లక్ష్యంగా ఉంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అందుకే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంద’ని అన్నారు.
ఎక్కడ ఉన్నవాళ్లు అక్కడే ఉండకపోతే వ్యాధిని నియంత్రించలేమని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ మూడు వారాలు ఎక్కడివాళ్లు అక్కడే ఉండిపోవాలని సూచించారు. వేరే చోటుకి మారితే వారి వివరాలు సేకరించడం కష్టమవుతుందని చెప్పారు.
ఏ సమస్య ఉన్నా 1902కి ఫోన్ చేయండి:
అమరావతి: కరోనా వైరస్ వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపుతుందని, వారిని కాపాడుకోవాల్సిన అవసరముందని ఏపీ సీఎం జగన్ అన్నారు. కరోనా, లాక్‌డౌన్ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 80.9శాతం మంది ఇళ్లలోనే ఉండి కోలుకునే పరిస్థితి ఉందన్నారు. ఏ సమస్య ఉన్నా హెల్ప్‌లైన్ నెం. 1902కి ఫోన్ చేస్తే చాలన్నారు. కంట్రోల్ రూమ్‌లో సీనియర్ ఐఏఎస్ అధికారి కృష్ణబాబు ఆధ్వర్యంలో 10 మంది అధికారులు ఉంటారని చెప్పారు. ఎవరికి బాగా లేకపోయినా 104కి ఫోన్ చేయాలని సీఎం జగన్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా క్వారంటైన్ కేంద్రాలు, 213 వెంటిలేటర్లు సిద్ధం చేశామని తెలిపారు. కరోనాపై ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు.
AP CM press meet highlights on Corona virus Covid-19.
0 Comments