Teachers9.com updates

latest info

More Posts >>

Teachers9

More Posts >>

Teachers Useful Info

More Posts >>

Health Tip - Butter Milk is the best drink in morning


Read also:
Health Tip - Butter Milk is the best drink in morning. ఉదయం టీ కాఫీలకు బదులు ఒక గ్లాసుడు మజ్జిగ తీసుకుంటే.. ఏంటి ఫలితం అని తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవండి. ఉదయం టీ, కాఫీలకు బదులుగా ఒక గ్లాసు మజ్జిగ తీసుకుంటే ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. కడుపులో ఉండే పేగుల్లో పేరుకుపోయిన బ్యాక్టీరియాను తరిమికొట్టడంలో ఎంతో సహాపడుతుంది ఈ మజ్జిగ. ఈ మజ్జిగను తీసుకోవడం వల్ల చక్కర స్థాయిని నియంత్రించవవచ్చు.

Health Tip - Butter Milk is the best drink in morning

స్థూలకాయులు మజ్జిగలో కాస్త మిరియాలు, కరివేపాకు వేసుకుని తాగితే కొవ్వు స్థాయిని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా రానున్న వేసవి కాలంలో మజ్జిగను మాత్రం మరిచిపోకూడదు. డీహైడ్రేషన్‌ను మజ్జిగ నియంత్రిస్తుంది. ఒంటి వేడికి మజ్జిగ దివ్యౌషధంలా పనిచేస్తుంది. మజ్జిగలో కాల్షియం, విటమిన్ బి, పొటాషియం ఉంటాయి.
అందువల్ల శరీరానికి బలం చేకూరుతుంది.
మజ్జిగ ఆరోగ్యానికే కాదు చర్మానికి , శిరోజాలకు ఎంతో మేలు చేస్తుంది. కురులకు మజ్జిగను పట్టింది ఒక అరగంట ఉండి తల స్నానం చేస్తే ఎంతో మృదువైన కురులు మీ సొంతం అవుతాయి. ఇక మజ్జిగను చర్మానికి రాసుకుని అరగంట పాటు ఉంచుకుని ఆ తరువాత స్నానం చేస్తే చర్మ సమస్యలు దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. Health Tip - Butter Milk is the best drink in morning.

Post a Comment

0 Comments