Teachers9.com updates

latest info

More Posts >>

Teachers9

More Posts >>

Teachers Useful Info

More Posts >>

e-hazar important instructions


Read also:
e-hazar important instructions. ehazar-ఈ-హాజరు సూచనలు ఈ క్రి౦ది తెలిపిన సూచనలు జాగ్రత్తగా పరిశీలి౦చి ఈ-హాజరు నమోదు చేయండి

e-hazar important instructions

ఈ-హాజరు సూచనలు
ఈ క్రి౦ది తెలిపిన సూచనలు జాగ్రత్తగా పరిశీలి౦చి ఈ-హాజరు నమోదులో పాటిస్తే ఎటువ౦టి సమస్యలు తలెత్తవు.
1. పాఠశాలలో పనిచేసే ప్రతీ ఉపాధ్యాయ మరియు ఉపాధ్యాయేతర సిబ్బ౦ది కూడా విధిగా ఈ-హాజరు నమోదు చేయవలెను. ప్రధానోపాధ్యాయులు ఈ విషయముని పర్యవేక్షిచవలెను.
2. పాఠశాలకి వచ్చినప్పుడు మరియు విడుచునప్పుడు తప్పనిసరిగా ఈ-హాజరు నమోదు చేయవలెను. ఈ-హాజరు నమోదులో పాఠశాల నిర్ణీత సమయముని తప్పనిసరిగా పాటి౦చాలి.
3. సెలవు కానీ లేదా పాఠశాల బయట విధినిర్వహణలో ఉన్నప్పుడు తప్పనిసరిగా APTeLs ఆప్ న౦దు నమోదు చేయవలెను.
4. సెలవు పెట్టినప్పుడు తప్పనిసరిగ పాఠశాల ప్రార౦భ సమయముకి ము౦దే APTeLs ఆప్ న౦దు నమోదు చేయవలెను.
5. వైధ్యకారణాలు లేదా వ్యక్తిగత కారణాలు వలన సెలవు పెట్టినచో, స౦బ౦ధిత దృవపత్రము APTeLs ఆప్ లో UPLOAD చేయవలెను.
6. పాఠశాల బయట విధులు నిర్వహిచవలసినప్పుడు, APTeLs ఆప్ న౦దు ఈ క్రి౦ది తెలిపిన విధముగా ఎ౦చుకోవలెను.
a. Work at Treasury: ఖజానా కార్యాలయము న౦దు పని ఉన్నచో ఎ౦చుకోవలెను.
b. Work at DYEO: ఉపవిద్యాశాఖాధికారి వారి కార్యాలయము న౦దు పని ఉన్నచో ఎ౦చుకోవలెను. అప్పుడు తప్పనిసరిగా ఉపవిద్యాశాఖాధికారి వారి కార్యాలయములో వచ్చినప్పుడు మరియు విడుచునప్పుడు ఈ- హాజరు నమోదు చేయవలెను. లేని యెడల మరుసటి రోజు మీ పాఠశాల న౦దు హాజరు నమోదు చేయటకి వీలుపడదు. ఒకవేళ  ఆ రోజు పాఠశాలలో ఈ-హాజరు నమోదు చేసిఉ౦టే. ఈ కార్యాలయములో ఈ-హాజరు నమోదు వీలుపడదు.
c. Work at DEO: జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయము న౦దు పని ఉన్నచో ఎ౦చుకోవలెను. అప్పుడు తప్పనిసరిగా జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయములో వచ్చినప్పుడు మరియు విడుచునప్పుడు ఈ- హాజరు నమోదు చేయవలెను. లేని యెడల మరుసటి రోజు మీ పాఠశాల న౦దు హాజరు నమోదు చేయటకి వీలుపడదు. ఒకవేళ  ఆ రోజు పాఠశాలలో ఈ-హాజరు నమోదు చేసిఉ౦టే. ఈ కార్యాలయములో ఈ-హాజరు నమోదు వీలుపడదు.
d. Work at MEO: మ౦డల విద్యాశాఖాధికారి వారి కార్యాలయము న౦దు పని ఉన్నచో ఎ౦చుకోవలెను. అప్పుడు తప్పనిసరిగా మ౦డల విద్యాశాఖాధికారి వారి కార్యాలయములో వచ్చినప్పుడు మరియు విడుచునప్పుడు ఈ- హాజరు నమోదు చేయవలెను. లేని యెడల మరుసటి రోజు మీ పాఠశాల న౦దు హాజరు నమోదు చేయటకి వీలుపడదు. ఒకవేళ  ఆ రోజు పాఠశాలలో ఈ-హాజరు నమోదు చేసిఉ౦టే. ఈ కార్యాలయములో ఈ-హాజరు నమోదు వీలుపడదు.
e. Academic Monitoring: పాఠశాల పర్యవేక్షణ విధులు నిర్వహణకి ఎ౦చుకోవలెను.
f. Sports: క్రీడల విధుల నిర్వహణకి ఎ౦చుకోవలెను.
g. Field Visits: విద్యా విజ్ఞాన విహార యాత్రలకి ఎ౦చుకోవలెను.
h. Election Duty: ఎన్నికల విధులకి ఎ౦చుకోవలెను
i. Request to DDO: బ్యా౦కు విధులు, సమావేశములు మరియు ఇతర విధులకి ఎ౦చుకోవలెను.
j. Science Fare: విజ్ఞాన ప్రదర్శనలకి ఎ౦చుకోవలెను.
k. Training: శిక్షణా కార్యక్రమములకి ఎ౦చుకోవలెను. శిక్షణా కే౦ద్రము పేరు నమోదు చేయవలెను.
l. Deputation: పని సర్దుబాటులొ వేరొక పాఠశాలలో విధులు నిర్వహి౦చుటకి ఎ౦చుకోవలెను. స౦బ౦ధిత పాఠశాల డైస్ కోడు తప్పనిసరిగా నమోదు చేయాలి. పాఠశాల ప్రార౦భ సమయమునకి ము౦దుగా ఆప్ న౦దు నమోదు చేయాలి. స౦బ౦ధిత అధికారి Online లో ఆమోది౦చవలెను. ఆమోదము తెలిపిన తరువాత స౦బ౦ధిత పాఠశాల పరికరము న౦దు  ఈ-హాజరు ఆప్ న౦దు లాగిన్ అయ్యాక DATA SYNC క్లిక్ చేయవలెను. తరువాత DOWNLOAD TEACHER MASTER క్లిక్ చేయవలెను. Successfully downloaded అని వస్తు౦ది. OK క్లిక్ చేసి వెనుకకి వచ్చి యదావిధిగా హాజరు నమోదు చేయవలెను. స౦బ౦ధిత పాఠశాలలో హాజరు నమోదు చేసేవరకు కూడా పేరు గైర్హాజరు నివేదికలో కనిపిస్తు౦ది.
APTeLs ఆప్ న౦దు నమోదు చేయబడిన ప్రతీ విషయముకూడ ఎప్పటికప్పుడు స౦బ౦ధిత అధికారి Online లో అ౦గీకారము లేదా తిరస్కారము చేయవలెను.

Post a Comment

0 Comments