ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.3.5లక్షల కోట్ల మూలధనసాయం.
డిపాజిట్ల సొమ్మును సురక్షితంగా ఉంచేందుకు తగిన చర్యలు.
కంపెనీ చట్టంలో మార్పులు. బ్యాంకింగేతర హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలకు అదనపు నిధుల కేటాయింపునకు కొత్త పథకం.
ఆదాయపన్ను శ్లాబ్‌లు నాలుగు నుంచి ఏడుకు పెంపు.
రూ. 0 నుంచి రూ.5 లక్షల వరకు ఎలాంటి ఆదాయపన్ను లేదు
ఆదాయం రూ.5 నుంచి 7.5లక్షలు ఉన్నవారికి 10శాతం పన్ను. రూ 7.5లక్షల నుంచి రూ.10లక్షల వరకూ 15శాతం పన్ను. రూ.10లక్షల నుంచి 12.5లక్షల వరకూ 20శాతం పన్ను. రూ.15లక్షలకు పైగా ఆదాయం ఉంటే 30శాతం పన్ను
Note: 5 లక్షల లోపు ఆదాయం కలిగి ఉంటే పన్ను ఉండదు కానీ, ఆదాయం 5 లక్షల రూపాయలు దాటితే 2.5 లక్షల నుండి 5 లక్షల వరకు పన్ను 5% చెల్లించాల్సి ఉంటుంది.
కొత్త స్లాబ్ లతో పన్ను చెల్లించేవారికి 80(c) రిబేటు వర్తించదు.
అంటే పిఎఫ్, ఇన్సూరెన్స్ తదితర పొదుపు మొత్తాలు, సిపిఎస్, గృహ రుణాల పై ఇచ్చే రాయితీలు వదులుకున్నవారికి మాత్రమే ఈ రేట్లు మిగిలిన వారికి పాత రేట్లే.
ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ వాటాల విక్రయం. స్టాక్‌మార్కెట్‌లో ఎల్‌ఐసీ లిస్టింగ్
జమ్మూకశ్మీర్ అభివృద్ధికి రూ.30,757కోట్లు.
బ్యాంకు డిపాజిట్లపై బీమా రూ.లక్ష నుంచి రూ.5లక్షలకు పెంపు
భారత్‌లో చదవాలనుకునే విదేశీ విద్యార్థులకు స్టడీ ఇన్ ఇండియా ప్రోగ్రాం ‘ఇండ్‌శాట్’
బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెద్దపీట
రూ 15 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు. వ్యవసాయ, గ్రామీణాభివృద్ధికి రూ 2.83 లక్షల కోట్లు. పంచాయితీరాజ్‌కు రూ 1.23 లక్షల కోట్లు. ఆరోగ్య రంగానికి రూ 69,000 కోట్లు.
మొదటి ప్రాధాన్యాంశంగా వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి. ద్వితీయ ప్రాధాన్యాంశంగా ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు. మూడో ప్రాధాన్యాశంగా విద్య, చిన్నారుల సంక్షేమం.
2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడం ,రైతు సంక్షేమానికి 16 కార్యాచరణ ప్రణాళికలు
100 కరువు జిల్లాలకు తాగునీరు అందించే పథకాలు
26 లక్షల మంది రైతులకు సోలార్ పంపు సెట్లు
పేదరికం నుంచి 27 కోట్లమందిని బయటకు తెచ్చాం
ఇక నుంచి ఇన్‌కం టాక్స్ రిటర్న్‌ల ఫైలింగ్ మరింత సులభతరం చేస్తాం
ఆరు కోట్ల 11 లక్షల మందికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన
జీఎస్టీతో పన్ను వ్యవస్థలోకి కొత్తగా 60 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు
రూ లక్ష కోట‍్ల వరకూ జీఎస్టీ ప్రయోజనాలు సామాన్యులకు మళ్లింపు
40 కోట్ల జీఎస్టీ రిటర్నులు దాఖలయ్యాయి
జీఎస్టీ శ్లాబుల తగ్గింపుతో సామాన్యులకు మేలు జరిగింది
జీఎస్టీ అమలు తర్వాత సామాన్యుల ఖర్చులు 4శాతం వరకు ఆదా అయ్యాయి
1 Comments
Excellent service
ReplyDelete