Teachers9.com updates

latest info

More Posts >>

Teachers9

More Posts >>

Teachers Useful Info

More Posts >>

AP cabinet meeting highlights


Read also:
AP cabinet meeting highlights: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలివే. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఇందులో భాగంగా ఏపీ స్టేట్‌ అగ్రికల్చర్‌ కౌన్సిల్‌ ఏర్పాటు ముసాయిదాకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అలాగే ఏపీ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు

AP cabinet meeting highlights

అమరావతి: స్టేట్‌ అగ్రికల్చర్‌ కౌన్సిల్‌ ఏర్పాటు ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వచ్చే శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో బిల్లును ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం వివిధ అంశాలపై దాదాపు గంటన్నరసేపు చర్చించింది.  ‘జగనన్న విద్యాకానుక పథకం’ ద్వారా 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పుస్తకాల సంచులతో పాటు మూడు జతల దుస్తులు, రెండు జతల బూట్లు, పుస్తకాలను ఇవ్వాలనే ప్రతిపాదనపై మంత్రి వర్గం చర్చించింది.

AP cabinet meeting highlights

మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పేర్ని నాని .. కేబినెట్‌ నిర్ణయాలను మీడియాకు వివరించారు. ‘‘స్థానిక ఎన్నికల ప్రచారంలో మద్యం, డబ్బుతో పట్టుబడిన అభ్యర్థిపై అనర్హత వేటువేయాలని కేబినెట్‌ నిర్ణయించిందిస్థానిక సంస్థల ఎన్నికల ప్రచార సమయాన్ని కూడా కుదించాం.    పంచాయతీ ఎన్నికలకు ఏడు రోజులు, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు ఐదు రోజుల ప్రచారం సమయం ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించింది. మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియను నెల రోజుల నుంచి 15 రోజులకు తగ్గించాం. సర్పంచ్‌ స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఏర్పాటుకు  ఆమోదం తెలిపింది. ప్రకృతి వైపరీత్యాలు, నీటి ఎద్దడి సమయంలో సర్పంచ్‌ కు కొన్ని నిర్ణయాలు తీసుకునే విధంగా అధికారాలు కల్పించాం. పారిశుద్ధ్యం, పచ్చదనం బాధ్యతలను సర్పంచ్‌కే అప్పగిస్తూ నిర్ణయం. కొబ్బరి, పండ్లు, పూలతోటలు వేసి నష్టపోయిన రైతులకు ఇచ్చే పరిహారాన్ని నిపుణుల కమిటీ సూచనలకు అనుగుణంగా  పెంచాం.  డిస్కమ్‌లు, జెన్‌కోలపై రూ.32వేల కోట్ల అప్పులు ఉన్నాయి. గత ప్రభుత్వాలు సరిగా చెల్లించకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చింది. సౌరవిద్యుత్‌ను బాగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 10వేల మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. సౌర విద్యుత్‌ విషయంలో కేంద్రం కూడా అనేక ప్రోత్సాహకాలు ఇస్తోంది’’ అని  మంత్రి తెలిపారు.

Post a Comment

0 Comments