Teachers9.com updates

latest info

More Posts >>

Teachers9

More Posts >>

Teachers Useful Info

More Posts >>

New bill in Andhrapradesh assembly


Read also:
New bill in Andhrapradesh assembly: ఆంధ్రప్రేదశ్‌లోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈనెల 20న ఏపీ అసెంబ్లీలో రెండు సంచలన బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఆ రెండు బిల్లుల్లో మొదటిది 'ఆంధ్రప్రేదశ్ అభివృద్ధి వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి చట్టం 2020'. రెండోది ఏంటంటే గతంలో రాజధాని కోసం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చిన సీఆఆర్డీఏ చట్టాన్ని మార్చనుంది. 'ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ మార్పు చట్టం 2020' పేరుతో సీఆర్డీఏ చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురానుంది.

New bill in Andhrapradesh assembly

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. అందుకోసం వివిధ ప్రాంతాల్లో వివిధ ప్రభుత్వ విభాగాలను, శాఖలను, వ్యవస్థలను ఏర్పాటు చేస్తుంది.

అలాగే, రాష్ట్రాన్ని మూడు జోన్లుగా వర్గీకరించనుంది. ఆ మూడు జోన్లను పర్యవేక్షించేందుకు బోర్డులను ఏర్పాటు చేస్తుంది. ఆ బోర్డులో 9 మంది కంటే మించకుండా సభ్యులు ఉంటారు. ఆ జోన్‌లో అభివృద్ధికి ఏమేం చేయాలనే అంశాలను ఆ బోర్డు ఎప్పటికప్పుడు ప్రతిపాదిస్తూ ఉంటుంది. ప్రతి బోర్డులోనూ ముఖ్యమంత్రి చైర్మన్‌గా ఉంటారు. వారితో పాటు బోర్డుకు వైస్ చైర్మన్, కసీం ఓ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసిన నలుగురు సభ్యులు ఉంటారు. ఆ జోన్‌ను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి, అభివృద్ధి వికేంద్రీకరణకు ఈ జోన్లు క్రియాశీలకంగా ఉంటాయి.
సీఆర్డీఏ చట్టం 2014'ను జగన్ ప్రభుత్వం మార్చనుంది. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పాత సీఆర్డీఏ చట్టంలో ఉన్న నిబంధనలు, దాని కింద జారీ చేసిన నోటిఫికేషన్లు, జీవోలు అన్ని రద్దయిపోతాయి. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన చట్టంలోనివే అమలవుతాయి. గతంలో ఉన్న విజయవాడ - గుంటూరు - తెనాలి - మంగళగిరి అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ పునఃప్రారంభమవుతుంది. సీఆర్డీఏ పరిధి మొత్తం దానికిందకే వస్తుంది. సీఆర్డీఏ కింద తీసుకున్న అన్ని రుణాలు VGMTUDA కి బదిలీ అవుతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుంది. సీఆర్డీఏలో నియమితులైన ఉద్యోగులు అందరూ VGMTUDA కి బదిలీ అవుతారు. సీఆర్డీఏలో అభివృద్ధికి గతంలో చేసుకున్న ఒప్పందాలను ప్రభుత్వం మళ్లీ కొత్తగా చేసుకుంటుంది.
Credits: నేషనల్ మీడియా... CNN న్యూస్ కధనం..
New bill in Andhrapradesh assembly

Post a Comment

1 Comments