Teachers9.com updates

latest info

More Posts >>

Teachers9

More Posts >>

Teachers Useful Info

More Posts >>

IncomeTax benefits for salaried employees


Read also:
IncomeTax benefits for salaried employees ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. దీంతో అందరి దృష్టి అటువైపే ఉంది. ముఖ్యంగా వేతన జీవులైతే తమకు ఎలాంటి పన్ను ప్రయోజనాలు ఉంటాయో చూడాలన్న ఉత్సుకతతో ఉన్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం నిజమైతే గనుక ఈ సారి బడ్జెట్ శాలరీ పైనే ఆధారపడి జీవనం సాగించే ఇండివిడ్యుల్స్ కు గుడ్ న్యూస్ ఉన్నట్లే. ఎందుకంటే వచ్చే బడ్జెట్ లో ఒక్కో పన్ను చెల్లింపుదారుకు గరిష్టంగా రూ 2.5 లక్షల వరకు పన్ను ప్రయోజనం కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

IncomeTax benefits for salaried employees
ఇందులో భాగంగా పొదుపు చేసే సొమ్ము పరిమితిని పెంచటంతో పాటు, పన్ను చెల్లింపుదారులు చేతిలో ఖర్చు చేసేందుకు తగిన నిధుల లభ్యత ఉండేలా చూడాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది.
ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది. దాని ప్రకారం ఆదయ పన్ను చట్టం లోని 80 కేటగిరీ ని విస్తరించి అందులోనే పన్ను మినహాయింపులు, అదనపు పొదుపు పరిమితులను కల్పించే అవకాశం ఉంది. పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్(ఎన్ఎస్ సి) పరిమితులను సవరించి ప్రస్తుతమున్న లిమిట్ కంటే అధిక మొత్తంలో పన్ను చెల్లింపుదారులు అదుపు చేసేందుకు అనుమతివ్వనున్నారు.

1.80 సి లో రూ 2.50 లక్షల మినహాయింపు?
ప్రస్తుత ఆదయ పన్ను చట్టం లోని సెక్షన్ 80 లో గరిష్టంగా రూ 1.50 లక్షల మినహాయింపు వర్తిస్తుంది. కానీ ఇందులోనే పీపీఎఫ్, ఎన్ఎస్ సి, పిల్లల స్కూల్ ఫీజులు, ఎల్ఐ సి ప్రీమియం, హౌస్ రెంట్ అన్నీ కలిసి ఉన్నాయి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఈ పరిమితి సరిపోవటం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకు గాను ప్రభుత్వం దీనిని రూ 2.5 లక్షలకు పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇందులోనే పీపీ ఎఫ్, ఎన్ ఎస్ సి పరిమితిని పెంచి ఇండివిడ్యుల్స్ కు ఊరటనిస్తారని అంచనా. పన్ను స్లాబులను తగ్గిస్తే కేంద్రానికి రావాల్సిన రాబడి దెబ్బతింటుంది కాబట్టి... ఇలాంటి పొదుపు చర్యలను ప్రోత్సహించటం మేలని ప్రభుత్వం భావనగా ఉంది.
2.మూడు కోట్ల మందికి ప్రయోజనం..
మన దేశంలో సగటున రూ 5 లక్షల వార్షిక వేతనం ద్వారా సమకూరే ఆదాయం కలిగిన వారు సుమారు 3 కోట్ల మంది ఉన్నట్లు ప్రభుత్వ అంచనా. ప్రభుత్వం ఈ సరికొత్త పన్ను మినహాయింపులు ఇస్తే.. వీరందరికీ ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతుంది. 80సి లిమిట్ పెంచితే చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉంటే ఒక కుటుంబం కనిష్టంగా రూ 1 లక్ష వరకు స్కూల్ ఫీజులే కడుతోంది. ఎల్ ఐ సి ప్రీమియం, హోమ్ లోన్ ప్రిన్సిపాల్ ఇవన్నీ రూ 1.5 లక్ష లోపే అంటే... వారికి పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. కానీ ఈ పరిమితిని రూ 2.5 లక్షలకు పెంచితే మాత్రం చాలా ఉపయోగకరంగా ఉంటుందని టాక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
3.సేవింగ్స్ పెంచేందుకే...
దేశంలో నానాటికీ పొదుపు రేటు పడిపోతోంది. ఒకప్పుడు జీడీపీ లో సుమారు 30% పొదుపు ఉండగా... 2017-18 లో అది కేవలం 17.2% నికి పడిపోయింది. ఇది నిజంగా మన ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు. 2011-12 లో కూడా దేశ జీడీపీ లో సేవింగ్స్ వాటా 23.6% గా ఉండటం గమనార్హం. దేశంలో పొదుపు రేటు పడిపోవటం ఆ దేశ వ్యవస్థ మూలాలు బలహీనపడటాన్ని సూచిస్తుంది. అదే సమయంలో పౌరులు వినియోగం వైపు మళ్లుతున్నారని తెలుపుతుంది. కానీ మన దేశంలో ప్రస్తుతం అటు పొదుపు సరిపడినంతగా లేదు, ఇటు వినియోగమూ తగ్గుతోంది. ఇదే అంశం ప్రస్తుతం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. అందుకే పొదుపు చర్యలను ప్రోత్సహించే విషయాలకు బడ్జెట్ లో ప్రాధాన్యం కల్పించాలని భావిస్తోంది.
Note: Source from WhatsApp information. This is supposed information only. If all is good this will effect from next financial year.
IncomeTax benefits for salaried employees

Post a Comment

0 Comments