Teachers9.com updates

latest info

More Posts >>

Teachers9

More Posts >>

Teachers Useful Info

More Posts >>

Andhra Pradesh Police Jobs - 2156 స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఉద్యోగాలు... పూర్తి వివరాలివే


Read also:
Andhra Pradesh Police Jobs - 2156 స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఉద్యోగాలు. స్పెషల్ పోలీస్ ఆఫీసర్-SPO పోస్టుల్ని ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నియమిస్తారు. వీరు చెక్‌ పోస్టులు, మొబైల్ యూనిట్ల పనిచేయాల్సి ఉంటుంది. పోలీసులకు సహకారం అందించాల్సి ఉంటుంది.

Andhra Pradesh Police Jobs - 2156 స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం త్వరలో 2156 స్పెషల్ పోలీస్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేయబోతోంది. ఇసుక, మద్యం అక్రమ రవాణాను అడ్డుకోవడానికి చెక్‌పోస్టులు, మొబైల్ యూనిట్లను ఏర్పాటు చేయబోతోంది. ఒక చెక్‌పోస్ట్ లేదా మొబైల్ యనిట్‌లో 1 హెడ్ కానిస్టేబుల్ లేదా కానిస్టేబుల్, ఇద్దరు ప్రత్యేక పోలీసు అధికారులు ఉంటారు. రెండు షిఫ్టుల్లో వీరిని నియమిస్తారు. ఈ చెక్‌పోస్టులు, మొబైల్ యూనిట్లలో 24 గంటలు పనిచేయడానికి 3234 మంది సిబ్బంది అవసరమని డీజీపీ హోం శాఖకు ప్రతిపాదల్ని పంపింది. ఈ ప్రతిపాదనలకు హోం శాఖ ఆమోదం లభించింది. మొత్తం 3234 పోస్టుల్లో 1078 మందిని పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి కేటాయిస్తారు. మిగిలిన 2156 స్పెషల్ పోలీస్ ఆఫీసర్-SPO పోస్టుల్ని ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నియమిస్తారు. వీరు చెక్‌ పోస్టులు, మొబైల్ యూనిట్ల పనిచేయాల్సి ఉంటుంది. పోలీసులకు సహకారం అందించాల్సి ఉంటుంది.

స్పెషల్ పోలీస్ ఆఫీసర్-SPO పోస్టులకు అర్హతలు:

మొత్తం 2156 మంది స్పెషల్ పోలీస్ ఆఫీసర్-SPO పోస్టుల్ని నియమించనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎస్‌పీఓలను ఎంపిక చేసే బాధ్యతల్ని జిల్లా ఎస్‌పీలకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎక్స్ సర్వీస్‌మెన్, రిటైర్డ్ పారామిలిటరీ దళాలు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు, పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో హోం గార్డులుగా పనిచేసినవారు, పేరుపొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి సెక్యూరిటీ గార్డుగా శిక్షణ పొందినవారిని ఎస్‌పీఓలుగా నియమించనుంది. ఒకవేళ వీరిలో ఎవరూ అందుబాటులో లేకపోతే ఫిజికల్ టెస్ట్ ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు. వయస్సు 65 ఏళ్ల లోపు ఉండాలి. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. ఎలాంటి క్రిమినల్ కేసులు ఉండకూడదు. ఈ పోస్టులు ఒక ఏడాది మాత్రమే ఉంటాయి.

Post a Comment

0 Comments