Teachers9.com updates

latest info

More Posts >>

Teachers9

More Posts >>

Teachers Useful Info

More Posts >>

Solar eclipse సూర్య గ్రహణం తీసుకోవాల్సిన జాగ్రత్తలు


Read also:
Solar eclipse - సూర్యుడు, భూమి మధ్యలోకి చంద్రుడు వచ్చినప్పుడు సూర్య గ్రహణం ఏర్పడుతుందని చిన్నప్పుడే చదువుకున్నాం. ఇక ఈ సంవత్సరం 26వ తేదిన సంపూర్ణ గ్రహణం రానుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం గం.8.09ని.లకు గ్రహణం ప్రారంభం అయ్యి ఉదయం గం.11.11ని.లకు ముగుస్తుంది. మొత్తం మూడు గంటల రెండు నిమిషాల పాటు భారతదేశం అంతటా ఈ గ్రహణం కనిపించనుంది. అయితే కర్ణాటక, తమిళనాడు, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో కంకణోక్త సంపూర్ణ సూర్య గ్రహణం వేర్వేరు సమయాల్లో ఉండనుండగా.. మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ పాక్షిక సూర్యగ్రహణం కనిపించనుంది.
అలాగే శ్రీలంక, కొన్ని గల్ఫ్ దేశాలు, సుమత్రా, మలేషియా, సింగపూర్‌లోనూ గ్రహణం ఎఫెక్ట్ కనిపించనుంది. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని ఆలయాలు మూసివేయనున్నారు.
Solar eclipse సూర్య గ్రహణం తీసుకోవాల్సిన జాగ్రత్తలు
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
ఇదిలా ఉంటే సాధారణంగా గ్రహణాన్ని చూసేందుకు చాలా మంది ఆసక్తిని చూపుతుంటారు. అయితే ప్రత్యక్షంగా గ్రహణాన్ని చూడటం వలన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ముఖ్యంగా సోలార్ ఫిల్టర్స్, బైనాక్యులర్‌ కలిగిన ప్రొజెక్టర్లు, ఎక్‌లిప్స్ గ్లాసెస్‌ను వాడాలని వారు చెబుతుంటారు. అలాగే రెగ్యులర్ సన్ గ్లాసెస్‌ను ఉపయోగించకూడదని వారు సూచిస్తుంటారు.

2019 డిసెంబర్ 26 వ తేదీ,గురువారం
సమయం.. ఉదయం గం. 8.14 ల నుండి గం.11.24 ల వరకు
కొన్ని జాగ్రత్తలు తీసుకొని అందరూ(విద్యార్థులు, పెద్దలు,గర్భిణి స్త్రీలు మొ. న అందరూ) ఈ గ్రహణం ను వీక్షించవచ్చు

గ్రహణం ను వీక్షించేతపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు
1.సురక్షిత సోలార్ ఫిల్టర్స్ సాయంతో మాత్రమే చూడాలి
2.వెల్డింగ్ షాపు వారు ఉపయోగించే నెం.14 గ్లాసు సాయంతో కూడా వీక్షించ వచ్చు
3.మసి బూసిన అద్దం,X-రే ఫిల్మ్ మొదలైన వాటితో చూడటం సురక్షితం కాదు...
4.సోలార్ ఫిల్టర్స్ లేదా నెం.14 వెల్డింగ్ గ్లాస్ ను ముఖానికి అమర్చుకున్న తరువాత మాత్రమే సూర్యుడు వైపు చూడాలి...అదేవిధంగా తలను క్రింద కు దించిన తరువాత మాత్రమే గ్లాస్ ను తీయాలి
5.సురక్షిత ఫిల్టర్స్ తో కూడా అదే పనిగా ఎక్కువ సేపు చూడకూడదు..5నుండి 7 సెకన్లు మాత్రమే వీక్షించి మరలా కాసేపటికి తరువాత ఇంతే సమయం లో చూడటం.... ఈ విధంగా గ్రహణం వదిలే వరకు  వీక్షించడం సురక్షితం...

Post a Comment

0 Comments