Teachers9.com updates

latest info

More Posts >>

Teachers9

More Posts >>

Teachers Useful Info

More Posts >>

Sea Food - nutrients


Read also:
Sea Food - nutrients సముద్రపు చేపలను ఉత్తమ పోషకాలు ఇచ్చే మంచి ఆహారంగా మనం పరిగణించవచ్చు. మంచి ఆరోగ్యానికి,  నాణ్యమైన మాంసకృత్తులను పొందడానికి చేపలు తినాల్సిందే. అమినో ఆమ్లాలు ఎక్కువగా ఉండే మాంసాహారం చేపలు మాత్రమే. ఈ క్రమంలో మనం కూడా చేపల వల్ల కలిగే ఉపయోగాలేమిటో తెలుసుకుందాం..!

Sea Food - nutrients


  1. ప్రతీ రోజూ చేపలు తినేవారిలో గుండె జబ్బులు, మధుమేహం వంటి ముప్పు కారకాలు తక్కువగా ఉంటాయని కొందరు వైద్యులు చెబుతుంటారు.
  2. చిన్న చేపలను ముల్లుతో సహా తిన్నప్పుడు కాల్షియం, భాస్వరం, ఐరన్‌ అధికంగా శరీరానికి లభిస్తాయి.
  3. చేపల్లో ఎక్కువగా లభించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండెకు మేలు చేస్తాయి.
  4. పెద్దపేగు, మలద్వార క్యాన్సర్ల ముప్పు నుండి తప్పించుకొనేందుకు కూడా రోజూ చేపలు తినాల్సిన అవసరం ఉంది.
  5. మాంసకృత్తులు, విటమిన్ ఎ, విటమిన్ డి, ఫాస్ఫరస్ మొదలైనవి దండిగా లభించే ఆహార పదార్థం చేప మాత్రమే.
  6. గట్టి ఎముకలకు, పళ్లకు అవసరమయ్యే ఫ్లోరిన్‌తో పాటు.. రక్తవృద్ధికి అవసరమయ్యే హీమోగ్లోబిన్‌ పెరగడానికి, అందుకు కావాల్సిన ఇనుము చేపల్లో విరివిగా లభిస్తుంది
  7. లావు పొట్ట రాకుండా ఉండాలంటే వారానికి కనీసం రెండు సార్లయినా చేపలు తినడం మంచిది అంటుంటారు. 
  8. చేపల కాలేయంలో ఉండే విటమిన్‌ డి ఎముకల పెరుగుదలకు కీలకమని భావించవచ్చు.
  9. అలాగే చేప కొవ్వు ద్వారా ఎ, డి, ఇ, కె విటమిన్లు మన శరీరానికి తేలికగా అందుతాయి.
  10. గర్భిణీ స్త్రీలు చేపలు తినడం వల్ల.. కడుపులో బిడ్డకు మంచి ప్రొటీన్లు అందుతాయి. వారి మెదడు కూడా బాగా అభివృద్ధి చెందుతుంది.

Post a Comment

0 Comments