SBI నుంచి ఎస్ఎంఎస్ అలర్ట్స్ రావట్లేదా? ఇలా చేయండి మీ అకౌంట్‌లో జరిగే లావాదేవీల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఎస్ఎంఎస్ అలర్ట్స్‌కు రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి. బ్యాంకులో మొబైల్ నెంబర్‌ను రిజిస్టర్ చేస్తే ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌కి ఓటీపీలు పొందడం కూడా సులువే.
- ఇటీవల కాలంలో ఆర్థిక మోసాలు ఎక్కువైపోయాయి. కార్డు మోసాలు పెరిగిపోతున్నాయి.
- ఏటీఎం కార్డు మీ జేబులో ఉన్నా ఎక్కడో లావాదేవీలు జరిగిపోతుంటాయి.
- తర్వాత ఎప్పుడో స్టేట్‌మెంట్ చూస్తే తప్ప అసలు విషయం బయటపడదు.
- ఇలాంటి మోసాలను వెంటనే గుర్తించడానికి ఉపయోగపడేది ఎస్ఎంఎస్ అలర్ట్.
- మీ అకౌంట్‌పై జరిగే ప్రతీ లావాదేవీకి ఎస్ఎంఎస్ అలర్ట్స్ పంపిస్తుంటాయి బ్యాంకులు.
- చాలామంది వీటి గురించి పెద్దగా పట్టించుకోరు.
- ఫోన్ నెంబర్ మార్చినప్పుడు బ్యాంకులో అప్‌డేట్ చేయరు.
- దీంతో ఎస్ఎంఎస్ అలర్ట్స్ అందుకోలేరు.
- మీ అకౌంట్‌లో జరిగే లావాదేవీల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఎస్ఎంఎస్ అలర్ట్స్‌కు రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి.
- బ్యాంకులో మొబైల్ నెంబర్‌ను రిజిస్టర్ చేస్తే ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌కి ఓటీపీలు పొందడం కూడా సులువే. అంతేకాదు.
- ఏదైనా అనధికార లావాదేవీలు జరిగితే వెంటనే మెసేజ్ వస్తుంది కాబట్టి అప్రమత్తం కావచ్చు.
- మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు ఎస్ఎంఎస్ అలర్ట్స్‌కి ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోండి.
- ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
- మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయండి.
- హోమ్ పేజీలో SMS Alerts లింక్ పైన క్లిక్ చేయండి.
- మీ సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్ల జాబితా కనిపిస్తుంది.
- అందులో మీరు ఎస్ఎంఎస్ అలర్ట్స్ పొందాలనుకునే అకౌంట్‌ను క్లిక్ చేయండి.
- ఎలాంటి అలర్ట్స్ పొందాలనుకుంటున్నారో సెలెక్ట్ చేయండి.
- మీరు ఎస్ఎంఎస్ అలర్ట్స్ కోసం రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ లావాదేవీలపై అలర్ట్స్ వస్తాయి.
- ఆన్‌లైన్‌లో కాకుండా మీరు బ్రాంచ్‌కు వెళ్లి కూడా ఎస్ఎంఎస్ అలర్ట్స్‌కి రిజిస్టర్ చేసుకోవచ్చు.
- మీరు ఎస్ఎంఎస్ అలర్ట్స్‌కి రిజిస్టర్ చేసుకోవడం మాత్రమే కాదు… మీరు పొందాల్సిన అలర్ట్స్‌ని మార్చుకోవచ్చు. అప్‌డేట్ చేయొచ్చు.
- మీరు ఎస్ఎంఎస్ అలర్ట్స్‌కి రిజిస్టర్ చేసుకుంటే ఈ కింది అంశాలకు అలర్ట్స్ పొందొచ్చు.
0 Comments