Teachers9.com updates

latest info

More Posts >>

Teachers9

More Posts >>

Teachers Useful Info

More Posts >>

ఎస్‌బీఐ శుభవార్త.. లోన్ తీసుకుంటే అదిరిపోయే ఆఫర్లు.. 50 శాతం డిస్కౌంట్!


Read also:
ఎస్‌బీఐ శుభవార్త.. లోన్ తీసుకుంటే అదిరిపోయే ఆఫర్లు.. 50 శాతం డిస్కౌంట్! లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. షాపింగ్ ఫెస్టివల్ ప్రకటించింది. ఇది కేవలం ఎస్‌బీఐ యోనో యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
SBI Loan Offers

  1. ఎస్‌బీఐ యోనో షాపింగ్ ఫెస్టివల్ 2.0  డిసెంబర్ 10 నుంచి ప్రారంభమౌతుంది. డిసెంబర్ 14 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఐదు రోజుల ఫెస్టివల్ షాపింగ్‌లో అదిరిపోయే డిస్కౌంట్లు, సూపర్ క్యాష్‌బ్యాక్స్ పొందొచ్చు. ఇవి కేవలం యోనో కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి.
  2. ఎస్‌బీఐ వివిధ ప్రొడక్టులపై ఆకర్షణీయ తగ్గింపు అందిస్తోంది. దీని కోసం వివిధ రకాల మర్చంట్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అంతేకాకుండా హోమ్ లోన్స్, ఆటో లోన్స్ కూడా ఆఫర్ చేస్తోంది. రుణాలపై కూడా పలు ప్రయోజనాలు అందిస్తోంది.
  3. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గిఫ్టింగ్, జువెలరీ, ఫర్నీచర్ సహా వివిధ కేటగిరిలపై అదిరిపోయే డీల్స్ అందిస్తున్నామని ఎస్‌బీఐ తెలిపింది. అంతేకాకుండా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు, ఎస్‌బీఐ డెబిట్ కార్డు ఉపయోగిస్తున్న వారు అదనపు క్యాష్‌బ్యాక్ పొందొచ్చని పేర్కొంది. ఎస్‌బీఐ కార్డులపై 10 శాతం అదనపు క్యాష్‌బ్యాక్ వస్తుందని తెలిపింది. గరిష్టంగా రూ.2,500 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చని పేర్కొంది.
  4. కారు, బైక్, స్కూటర్ వంటి వాహన కొనుగోలుకు వెహికల్ లోన్ అందిస్తోంది ఎస్‌బీఐ. బ్యాంక్ ఆటో లోన్స్‌కు అప్లై చేసుకున్న వారికి జీరో ప్రాసెసింగ్ ఫీజు సదుపాయాన్ని కల్పిస్తోంది. రుణంపై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. డిసెంబర్ 31 వరకు మాత్రమే ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది.
  5. స్టేట్ బ్యాంక్ వాహన రుణాలపై మాత్రమే కాకుండా హోమ్ లోన్స్‌పై ఆకర్షణీయ డీల్‌ను ప్రకటించింది. అర్హత కలిగిన కస్టమర్లు హోమ్ లోన్‌కు వెంటనే సూత్రప్రాయ ఆమోదం పొందొచ్చని తెలిపింది. అంతేకాకుండా ప్రాసెసింగ్ ఫీజులో ఏకంగా 50 శాతం వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చని తెలిసింది.
  6. స్టేట్ బ్యాంక్ యోనో షాపింగ్ ఫెస్టివల్ 2.0లో భాగంగా కస్టమర్లు ఆన్‌లైన్ షాపింగ్ చేయడం వల్ల 50 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు. పలు ప్రొడక్టులపై ఈ తగ్గింపుతోపాటు క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తోంది. అమెజాన్, ఓయో, థామస్ కుక్ సహా పలు సంస్థలు ఎస్‌బీఐ‌లో జతకట్టాయి.
  7. దేశంలో అతిపెద్ద బ్యాంక్‌గా స్టేట్ బ్యాంక్ కొనసాగుతోంది. బ్యాంక్ ఆస్తులు, డిపాజిట్లు, బ్రాంచులు, కస్టమర్లు, ఉద్యోగుల ఇలా ఏ విధంగా చూసినా కూడా ఎస్‌బీఐనే అతిపెద్ద బ్యాంక్. హోమ్ లోన్స్, ఆటో లోన్స్ విభాగాల్లో ఎస్‌బీఐకి 25 శాతం చొప్పున మార్కెట్ వాటా ఉంది. బ్యాంక్‌కు ఏకంగా 22,000 బ్రాంచులు, 58,000కు పైగా ఏటీఎం‌లు ఉన్నాయి.

Post a Comment

0 Comments