Teachers9.com updates

latest info

More Posts >>

Teachers9

More Posts >>

Teachers Useful Info

More Posts >>

New ration card rules in Andhrapradesh


Read also:
New Ration card rules in Andhrapradesh. ఆంద్రప్రదేశ్ లో రేషన్ కార్డుల జారీకి గతంలో ఉన్న అర్హతల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాలు, పట్టణాల్లో వార్షికాదాయం, ఇతర నిబంధనల్లో మార్పులు చేసింది. నాలుగు చక్రాల వాహనాలున్న వారిని బీపీఎల్ కోటా నుంచి మినహాయించారు. ఐతే క్యాబ్‌లు నడుపుకునే వారికి కూడా ఇది వర్తిస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.

New ration card rules in Andhrapradesh

గ్రామాల్లో వార్షికాదాయం రూ.లక్షా 20 వేలు లోపు ఉన్న వారు మాత్రమే అర్హులు.పట్టణాల్లో వార్షికాదాయం రూ.లక్షా 44 వేలకు లోపు ఉన్నవారు అర్హులు.


నాలుగు చక్రాల వాహనాలు ఉన్న వారిని బీపీఎల్ (దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారు) కోటా నుంచి మినహాయింపు.
ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులను బీపీఎల్ కోటా కింద పరిగణించేలా ఉత్తర్వులు జారీ.


రేషన్ కార్డు ఇప్పటికీ కూడా కీలకమైన డాక్యుమెంట్‌గానే కొనసాగుతోంది. దీన్ని ఐడెంటిటీ, అడ్రస్ ధ్రువీకరణ పత్రంగా పరిగణిస్తారు. రేషన్ కార్డు సాయంతో సబ్సిడీ ధరకే రేషన్ సరుకులు పొందొచ్చు. అందుకే ప్రతి ఒక్క కుటుంబం రేషన్ కార్డు కలిగి ఉండాలని భావిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డు ఎలా పొందాలో చూద్దాం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు రకాల రేషన్ కార్డులను అందిస్తోంది. ఒకటేమో తెల్ల రేషన్ కార్డు. రెండోదేమో పింక్ రేషన్ కార్డు. దారిద్ర రేఖకు దిగువున్న వారు తెల్ల రేషన్ కార్డు పొందొచ్చు. వీరికి సబ్సిడీ ధరకే రేషన్ సరుకులు లభిస్తాయి. ఇక దారిద్ర రేఖకు పైన ఉన్నవారు పింక్ రేషన్ కార్డు పొందొచ్చు. ఈ కార్డు కలిగిన వారు సబ్సిడీ ధరకు రేషన్ సరుకులు కొనలేరు.


కొత్త పెళ్లైన వారు రేషన్ కార్డు కోసం డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం దగ్గరిలోని మీ సేవకు వెళ్లాలి. మీ సేవకు వెళ్లే ముందు ఆధార్ కార్డు, భాగస్వామి ఆధార్ కార్డు, రెండు ఫోటోలు, ఇద్దరి రేషన్ కార్డులు మీ వద్ద ఉంచుకోండి.

మీసేవలో మీ పాత రేషన్ కార్డులో మీ పేరు తొలగిస్తారు. మీ భాగస్వామి పేరును కూడా వారి రేషన్ కార్డులో తీసేస్తారు. తర్వాత మీరు ఎంఆర్‌వో ఆఫీస్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ మీవి, మీ భాగస్వామి బయోమెట్రిక్స్ తీసుకుంటారు. తర్వాత మీకు ఒక అక్‌నాలెడ్జ్ నెంబర్ ఇస్తారు. తర్వాత మీరు 1100 నెంబర్‌కు ఫోన్ చేస్తే సరిపోతుంది. మీ కొత్త రేషన్ కార్డు స్టేటస్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ విధానం ఉండేది. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఇదే ప్రక్రియను కొనసాగిస్తుందా? లేకపోతే మార్పులు ఏమైనా చూస్తుందా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
This is all about New ration card rules in Andhrapradesh.

Post a Comment

0 Comments