Get your adhaar number. మీ అదార్ నెంబర్ మరిచిపోయారా? ఇలా చేయండి. ఆధార్ కార్డ్... ఇప్పుడు అన్ని పనులకు కావాల్సిన డాక్యుమెంట్. ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ ఉపయోగించడం మామూలే. అయితే ఎప్పుడూ ఆధార్ కార్డును వెంట తీసుకెళ్లడం కుదరదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఆధార్ కార్డు అవసరమైతే అప్పటికప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఆధార్ కార్డు ఎక్కడైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే ఆధార్ నెంబర్ ఉంటే ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేయడం సులభం. అలాగని ఆధార్ నెంబర్ తప్పనిసరిగా మీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. మీ దగ్గర మీ ఆధార్ నెంబర్ లేకపోయినా సరే మీరు... ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రింట్ తీసుకొని అవసరమైన చోట సబ్మిట్ చేయొచ్చు. ఈ అవకాశం కల్పిస్తోంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI. ఇందుకోసం కొన్ని స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. మరి ఆధార్ నెంబర్ అందుబాటులో లేకపోయినా, మర్చిపోయినా ఈజీగా ఆధార్ కార్డు ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి.
Get your adhaar number. మీ అదార్ నెంబర్ మరిచిపోయారా? ఇలా చేయండి.
- ముందుగా మీరు UIDAI అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ ఓపెన్ చేయండి.హోమ్ పేజీలో Get Aadhaar సెక్షన్‌లో Retrieve Lost or Forgotten EID/UID పైన క్లిక్ చేయండి.
- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Aadhaar No (UID) సెలెక్ట్ చేయండి.
- మీ పూర్తి పేరు, రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Sent OTP పైన క్లిక్ చేయండి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ సక్సెస్‌ఫుల్‌గా వెరిఫై అయిన తర్వాత ఆధార్ నెంబర్ మీ మొబైల్‌కు వస్తుంది.
- ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్‌తో ఆధార్ కార్డ్ ఈజీగా డౌన్‌లోడ్ చేయొచ్చు.
- ఇందుకోసం హోమ్ పేజీలోనే Get Aadhaar సెక్షన్‌లో Download Aadhaar పైన క్లిక్ చేయాలి.
- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Aadhaar number, EID, virtual ID అనే మూడు ఆప్షన్లు ఉంటాయి.
- వాటిలో I have Aadhaar number ఆప్షన్ ఎంచుకోండి.
- మీ 12 అంకెల ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేయండి.
- మీరు మాస్క్ ఆధార్ ఆప్షన్ ఎంచుకుంటే కార్డులో మొత్తం నెంబర్లు కాకుండా చివరి 4 అంకెలు మాత్రమే కనిపిస్తాయి.
- వెరిఫికేషన్ కోసం క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి.
- Send OTP పైన క్లిక్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
- ఓటీపీ ఎంటర్ చేసి నియమనిబంధల్ని అంగీకరిస్తూ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి.
- మీ ఆధార్ కార్డు డౌన్‌లోడ్ అవుతుంది.
- డౌన్‌లోడ్ అయిన ఆధార్ కార్డ్ ఓపెన్ చేయడానికి పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
- ఆధార్ కార్డులో మీ పేరులోని మొదటి 4 అక్షరాలు, మీరు పుట్టిన సంవత్సరం కలిపి 8 డిజిట్ పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి.
0 Comments