Teachers9.com updates

latest info

More Posts >>

Teachers9

More Posts >>

Teachers Useful Info

More Posts >>

Bank Loan తీసుకుంటున్నారా? ఈ సూచనలు మీ కోసమే!


Read also:
Some important suggestions when you are going to take a bank loan.బ్యాంక్ లోన్ తీసుకునేముందు కొన్ని విషయాలు బాగా గుర్తు పెట్టుకోవాలి. ముందుగా లోన్ తీసుకోవడానికి ఏ జాగ్రత్తలు పాటించాలో విషయాలు గమనించాలో చూద్దాం మరి.... అన్నీ బ్యాంకులు ఒకే రకమైన రూల్స్‌ ఉండవు. ఒక్కో బ్యాంక్ ఒక్కో రూల్‌ను ప్రవేశపెట్టడం జరుగుతుంది. ముందుగా ఏ బ్యాంక్‌లో తక్కువ వడ్డీ ఉందో మనం చూసుకోవాలి. ఒక్క వడ్డీ రేటుకు మాత్రమే పరిమితం కాకుండా ప్రిపేమెంట్ చార్జీలు, ప్రాసెసింగ్ ఫీజు వంటి పలు ఇతర అంశాలు గురించి కూడా తెలుసుకోవాలి.

suggestions on bank loan process
ముందుగా ఏ బ్యాంక్‌లో రుణం తీసుకోవాలో నిర్ణయించుకున్న తర్వాత లోన్ టెన్యూర్ అంశానికి ప్రాధాన్యత ఇవ్వండి చాల మంచిది. మీ లోన్ టెన్యూర్ ప్రాతిపదికన నెలవారీ ఈఎంఐ మారడం జరుగుతుంది. మీ రీపేమెంట్ సామర్థ్యం ఆధారంగా లోన్ టెన్యూర్ నిర్ణయం తీసుకోవడం చాల మంచిది. ఒక వేళా తక్కువ టెన్యూర్ పెట్టుకుంటే ఈఎంఐ ఎక్కువగా ఉంటుంది. కానీ మీరు బ్యాంక్‌కు చెల్లించే వడ్డీ మొత్తం మాత్రం తక్కువ అవుతుంది. అదే ఎక్కువ టెన్యూర్ పెట్టుకుంటే ఈఎంఐ కూడా తగ్గుతుంది కానీ ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది

ఇక లోన్ విషయంలో క్రెడిట్ స్కోర్ ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేసుకుంటూ ఉండాలి. మీరు ఎప్పుడైనా లోన్ ఏదో ఒక బ్యాంక్‌కు మాత్రమే పరిమితం అవ్వాలి. అంటే లోన్ తీసుకోవాలని భావిస్తే.. మీరు ఎంచుకున్న బ్యాంకుకు మాత్రమే లోన్ కోసం అప్లై చేసుకోండి. ఎక్కువ బ్యాంకులకు అప్లై చేస్తే చాల సమస్యలు వస్తాయి . ఇలా ఎక్కువ బ్యాంకులలో లోన్ అప్లై చేయడం వల్ల క్రెడిట్ స్కోర్‌ మీద బాగా ప్రభావం ఉంటుంది.

ఇంకో విషయం లోన్ పేమెంట్ లేదా క్రెడిట్ కార్డు బిల్లును ఇచ్చిన గడువులోగా చెల్లించడం చాల మంచిది. ఒక వేళా చెల్లించలేదు అంటే భారీ జరిమానాలు కట్టవలసి వస్తుంది. ఇలా చేయడం వల్ల సిబిల్ స్కోర్‌పై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. అందువల్ల చాల జాగ్రత్తగా ఉండడం చాల మంచిది. ఇంకా ఒక వేళా లోన్ తీసుకున్న వ్యక్తి ఈఎంఐ సరిగ్గా చెల్లించకపోతే అప్పుడు గ్యారెంటీపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. వీరి క్రెడిట్ స్కోర్‌పై కూడా ప్రభావం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరికైనా గ్యారెంటీ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది.
So remember the above suggestions when you are going to take a bank loan.

Post a Comment

0 Comments