Teachers9.com updates

latest info

More Posts >>

Teachers9

More Posts >>

Teachers Useful Info

More Posts >>

PMSBY Pradhan Mantri Suraksha Bima Yojana Scheme details


Read also:
The PMSBY or Pradhan Mantri Suraksha Bima Yojana Scheme is available to people in the age group 18 to 70 years with a bank account who give their consent to join/enable auto-debit on or before 31st May for the coverage period 1st June to 31st May on an annual renewal basis. Aadhar would be the primary KYC for the bank account. The risk coverage under the scheme is Rs.2 lakh for accidental death and full disability and Rs. 1 lakh for partial disability. The premium of Rs. 12 per annum is to be deducted from the account holder’s bank account through an ‘auto-debit’ facility in one installment.

PMSBY Pradhan Mantri Suraksha Bima Yojana Scheme details

PMSBY Pradhan Mantri Suraksha Bima Yojana Scheme details

పీఎంఎస్‌బీవై.. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన్.. ఈ పథకం సామాజిక సురక్షలో భాగంగా.. కేంద్ర ప్రభుత్వం.. మే 8వ తేదీ 2016లో ప్రవేశపెట్టింది. ఇది ఒక ప్రమాద బీమా పథకం. దీని ద్వారా యాక్సిడెంటల్‌గా జరిగే మరణాలకు, అంగవైకల్యానికి కేంద్ర ప్రభుత్వం బీమా కల్పిస్తుంది. దీని వ్యవధి ఏడాది మాత్రమే. అయితే దీనిని ప్రతి ఏడాది రెన్యువల్ చేసుకోవచ్చు. ఈ పథకం సామాన్య ప్రజానీకానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ స్కీం విశేషాలు ఎంటి.. దీనిని ఎలా అప్లై చేయాలి.. ఎవరు అర్హులు అన్నదాని గురించి తెలుసుకోండి.
  1.  ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన్.. ఇది ఒక ప్రమాద బీమా పథకం
  2. 18 నుంచి 70ఏళ్ళ వయస్సు మధ్య వారు ఈ పథకానికి అర్హులు
  3.  ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం.. ఏడాదికి రూ.12 మాత్రమే
  4. కేవైసీ గుర్తింపుగా ఆధార్ కార్డు ఉంటే చాలు..
  5.  బ్యాంకులో ఖాతా కల్గి ఉన్న వారు ఈ బీమా సులువుగా చేసుకోవచ్చు
  6. బ్యాంకు ఖాతా లేని వారు ఎల్‌ఐసీ ద్వారా కూడా అప్లై చేయవచ్చు
  7. ప్రతి ఏటా మే 31వ తేదీ నుంచి ఈ ఇన్సూరెన్స్ గడువు ప్రారంభమవుతుంది.
  8. సదరు బీమా దారు యాక్సిడెంట్‌లో మరణిస్తే రూ.2లక్షల ఇన్సూరెన్స్.. నామినీకి అందజేయబడుతుంది.
  9. ప్రమాదంలో అంగవైకల్యం కల్గితే.. రూ.1లక్ష వరకు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.
  10. ఈ పథకంలో ఎన్ఆర్ఐలు కూడా చేరవచ్చు. (అయితే వీరికి భారత కరెన్సీలో మాత్రమే ఇన్సూరెన్స్ చెల్లిస్తుంది.)
  11.  జన్‌ధన్ అకౌంట్లు కల్గి ఉన్నవారు.. ఈ బీమా పథకంలో చేరడం చాలా ఈజీ
  12.  బీమా చేయించుకోవాలనుకుంటున్న వాళ్లు.. బ్యాంకు మిత్రను కలిస్తే.. పూర్తి వివరాలు తెలియజేస్తారు.
  13.  ఒక వ్యక్తికి ఎన్ని అకౌంట్లు ఉన్నా.. ఒక అకౌంట్ నుంచి మాత్రమే బీమా వర్తిస్తుంది

బీమా క్లెయిమ్ చేసుకోవడం ఎలా..

బీమా పాలసీదారు అకాల మరణం చెందితే.. లేదా అంగవైకల్యంగా మారితే.. ఇన్సూరెన్స్ పొందటానికి తగిన పత్రాలను జమచేయాలి. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి, ఆస్పత్రి నుంచి పత్రాలు తీసుకోవాలి. దీనికి సంబంధించిన వివరాలు ఆస్పత్రి రికార్డుల ద్వారా ధృవీకరించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి వెంటనే ఇన్సూరెన్స్ చేసిన బ్యాంకును గానీ.. లేదా బ్యాంకు మిత్రను కలిసి.. పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. పీఎంఎస్‌బీవైలో చేరేటప్పుడు నామినీగా ఎవరిని సూచిస్తారో.. వారే బీమాను క్లెయిం చేసుకోవచ్చు.

Post a Comment

0 Comments