Teachers9.com updates

latest info

More Posts >>

Teachers9

More Posts >>

Teachers Useful Info

More Posts >>

Fit India school week Guidelines in Telugu


Read also:
Fit India School grading system has launched by our Prime Minister Narendra Modi in schools across the country. In Fit India Movement, schedules have been drawn for ranking schools in accordance with fitness and the schools that achieve this ranking will also be able to use the Fit India logo and flag. However, the level of rankings will depend on how much importance a school gives towards inculcating fitness among its students as well as teachers.

Fit India school week Guidelines in Telugu
మొత్తం 06 పనిదినాలు ఈ శారీరక సౌష్టవ ఉద్యమానికి ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లో “శారీరక సౌష్టవ వారోత్సవాలు” గా జరుపుకోవాలని సమగ్రశిక్ష, పాఠశాల విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ నిర్ణయించింది. అందువల్ల ఈ ఉద్యమం బాలబాలికలలో ఉన్న మందబుద్ధిని మరియు నిష్క్రియాత్మక ప్రవర్తనను తొలగించి ఉత్తేజపూరితులుగా మార్చడానికి ప్రయత్నిస్తుంది మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని సాధించడానికి విద్యార్థులందరిలో ఆటలయందు ఆసక్తిని పెంపొందించడానికి దోహదకారి అవుతుంది. ఇటువంటి కదలిక విద్యార్థులలో క్రమమైన శారీరక శ్రమ మరియు శారీర ధారుడ్యం పై అవగాహన, ఆత్మగౌరవం మరియు విశ్వాసాన్ని పెంచుతుంది. ఈ కార్యక్రమం యొక్క ఆరు రోజుల కార్యాచరణ మరియు కృత్యాలను ఈ క్రింద పొందుపరచడం జరిగింది.

శారీరక సౌష్టవ వారోత్సవాలు(తేదీ 2/12/2019 నుంచి 7/12/2019 )మార్గదర్శకాలు.

ప్రతి పాఠశాల  కచ్చితం గా రిజిస్టర్ చేసుకోవాలి. రిజిష్ట్రేషన్ కోసం Mail Id కూడా అందుబాటులో ఉంచుకోవాలి. రిజస్ట్రేషన్ అయిన వెంటనే స్కూలు వివరాలు అడుగుతుంది. వాటి వివరాలు క్రింది ఇవ్వబడ్డాయి.
1. ప్రిన్సిపాల్ పేరు: అంటే సంబంధిత పాఠశాల ప్రధనోపాధ్యాయుడు పేరు/ ప్రిన్సిపాల్ పేరు.
2. ప్రిన్సిపాల్ మొబైల్: సంబంధిత పాఠశాల ప్రధనోపాధ్యాయుడు మొబైల్ నంబర్.
3. అఫిలియేషన్ నంబర్: సంబంధిత పాఠశాల యొక్క రికగ్నిషన్ నంబర్.
4. స్కూల్ పేరు: సంబంధిత పాఠశాల పేరు
5. పాఠశాల అడ్రస్: సంబంధిత పాఠశాల అడ్రెస్స్.
6. రీజియన్: ఇక్కడ చెన్నయ్ అని పెట్టుకోవచ్చు.
7. సిటీ: మీ దగ్గర లో గల సిటీ నీ ఎంచోకొగలరు.
8. స్టేట్: ఆంధ్ర ప్రదేశ్
9. ఫైల్ ఎన్నిక(file upload): ఇక్కడ రిజిస్టర్ అయిన పాఠశాల ఫోటో  అప్ లోడ్ చేయాలి.
ఆరు రోజుల కార్యాచరణ
• మొదటి రోజు చేయవలసిన కృత్యం
(అ) ఉదయం అసెంబ్లీ-యోగా
(ఆ) విద్యార్థులు మరియు సిబ్బందికి శారీరక ధారుడ్యం మరియు పోషణపై అవగాహన కల్పించుట.
• రెండవ రోజు చేయవలసిన కృత్యం 
(అ) ఉదయం అసెంబ్లీ-చేతులతో వ్యాయామం
(ఆ) మానసిక ధారుడ్యంపై అవగాహనా కార్యక్రమం (ఉదా : చర్చలు, క్రీడా, మానసిక తత్వవేత్తల ఉపన్యాసాలు)
• మూడవ రోజు చేయవలసిన కృత్యం 
(అ) ఖేల్ ఇండియా యాప్ ద్వారా విద్యార్ధుల "ఫిట్ నెస్ అసెస్ మెంట్” ప్రారంభం.
(ఆ) “ఫిట్ బాడీ - ఫిట్ మైండ్ - ఫిట్ ఎన్విరాన్ మెంట్” అనే అంశాలపై విద్యార్థులందరికీ పోస్టర్ తయారీ పై పోటీ నిర్వహణ.
• నాల్గవ రోజు చేయవలసిన కృత్యం 
(అ) నృత్యము, ఏరోబిక్స్, యోగా, మార్షల్ ఆర్ట్స్, రోప్-స్కిప్పింగ్, గార్డెనింగ్ మొదలైన అంశములపై విద్యార్థులందరికీ శిక్షణా కార్యక్రమం.
(ఆ) "ఫిట్ ఇండియా స్కూల్” అనే అంశంపై విద్యార్థులందరికీ వ్యాసరచన / పద్య రచన పోటీల నిర్వహణ.
• ఐదవ రోజు చేయవలసిన కృత్యం
(ఆ) విద్యార్థులందరికీ ఫిట్ నెస్ పై స్పోర్ట్స్ క్విజ్
 • ఆరవ రోజు చేయవలసిన కృత్యం
 సాంప్రదాయ / స్వదేశీ / ప్రాంతీయ ఆటలలో ( ఉదా : కబడ్డీ, ఖోఖో ఆట, బొంగరాల ఆట, దొంగ పోలీస్ ఆట, గొలుసు ఆట, గోటి ఆట, పులి ఆట) విద్యార్థులు, సిబ్బంది మరియు తల్లిదండ్రుల కోసం పోటీల నిర్వహణ, మన దేశ వైవిధ్యంలో ఐక్యతను, మన దేశ ప్రజల మధ్య సాంప్రదాయకంగా ఉన్న భావోద్వేగ బంధాలను బలోపేతం చేయడం మొదలగు అంశాలపై విద్యార్థులను, తల్లిదండ్రులను భాగస్వామ్యం చేసి ఉత్తేజ పూరితమైన మరియు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయుట.

నా ఈవెంట్ అన్న విషయం లో మనం చేయాల్సినది, ముఖ్యమైనవి. 


  1. మొదటగా మీ యొక్క ఈవెంట్స్ అన్న చోట క్లిక్ చేసినప్పుడు, ఈవెంట్ కేటగిరీ అని వస్తుంది. అప్పుడు స్కూల్ వీక్ అని ఎంచుకోవాలి, 
  2. తరువాత ఈవెంట్ కోసం పోస్టర్ చిత్రాన్ని అప్ లోడ్ చేయండి అని ఉన్న చోట మీ స్కూల్ తరుపున ఏర్పరిచిన పోస్టర్ ను అప్లోడ్ చేయాలి. 
  3. తరువాత ఈవెంట్ రకం రిజిష్టర్ అన్న చోట పబ్లిక్ మరియు మల్టీ డే ను ఎంచుకోవాలి. ఆలా ఎంచుకున్న వెంటనే కార్యక్రమం యొక్క డేట్స్ ను నమోదు చేయాలి. 
  4. తరువాత ఈవెంట్ పేరు, ఆ కార్యక్రమంలో మీరు ఏమి చేయబోతున్నారు మరియు మిగతా వివరాలు నమోదు చేసి పూర్తీ చేయాలి. 
  5. అ) పాల్గొనే వారి వివరాలు గురించి : ఈ కార్యక్రమంలో పాల్గొన్న మొత్తం అనగా టీచర్స్, స్టూడెంట్స్, ఇతర పెద్దలు మరియు గ్రామస్తులు యొక్క వివరాలు నమోదు చేయాలి? ఈ విధంగా నమోదు చేయబడిన అందరికి డిజిటల్ సరిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈవెంట్ ఫోటోలను అప్లోడ్ చేయండి : 

ఈ కార్యక్రమంలో చాల ముఖ్యమైన పని ఏమిటంటే మీరు చేసిన ప్రతి చిన్న మరియు పెద్ద కార్యక్రమాలను ఎప్పుఇకప్పుడు చిత్రాలు మరియు వీడియోస్ రూపంలో పొందుపరుచుకోవాలి. వాటిని మీ లేదా స్కూల్ యొక్క ఫేస్ బుక్/యూట్యూబ్ ద్వారా పంచుకోవాలి. ఇక్కడ ఈ కార్యక్రమాలకు సంబందించిన వారు తీసిన చిత్రాలు, మొబైల్ / వీడియోస్ మరియు మీడియా క్లిప్పింగ్స్ ను అప్ లోడ్ చేయాలి.
Official site to log in FIT India registration
This is all about Fit India School grading system and Fit India school week Guidelines

Post a Comment

0 Comments